నవ్వుల వెనుక ఎంత విషాదం!

బిగుతుగా ఉండే కోటు, వదులుగా ఉండే పేంట్, పెద్ద బూట్లు, నెత్తిన డెర్బీ హ్యాట్, చేతిలో కర్రా – వీటన్నింటితో చూడగానే నవ్వు వచ్చేలా ఉంటాడు చార్లీ చాప్లిన్. ఇతని నడక కూడా విచిత్రంగా ఉంటుంది. భూమికి కొంచం ఎత్తులో కట్టిన తాడుమీద నడచినట్టు, బ్యాలన్స్ చేసుకొంటూ అడుగులు వేస్తాడు. మోడ్రన్ టైంస్, సిటీ లైట్స్ లాంటి ఎన్నో సినిమాలు తీసి, వాటిల్లో నటించాడు. కథ, సంగీతం, దర్శకత్వం అన్నీ అతనే. ఈ సినిమాలలో ప్రత్యేకత ఏమిటంటే చాలా నవ్విస్తాయి కానీ, `అయ్యో పాపం,` అనిపించేలా విషాదం ఉంటుంది. 
చార్లీ చాప్లిన్ చిన్నప్పుడు కటిక దరిద్రంలో బ్రతుకుతాడు. కట్టుకోవడానికి సరయిన బట్టలు, తినడానికి తిండీ ఉండవు. వాళ్ళ ఇంటిదగ్గర ఒక గొర్రె మాంసం అమ్మే దుకాణం ఉంటుంది. ఒకరోజు అక్కడినుంచి ఒక గొర్రెపిల్ల తప్పించుకొని రోడ్డు మీదకి వచ్చేస్తుంది. దానిని పట్టుకోవడానికి కసాయి వీధంతా పరుగులు పెడతాడు. గొర్రెపిల్ల వాడిని నానా తిప్పలూ పెడుతుంది. చూసిన అందరూ పడీ, పడీ నవ్వుతారు. కానీ, పాపం చివరికి అది వాడికి దొరికి పోతుంది. అప్పటి వరకూ నవ్వించిన గొర్రెపిల్ల మరికొంత సేపటిలో చంపబడుతుందని తెలిసి చాప్లిన్ చాలా ఏడుస్తాడు. 
ఈ సంఘటనే అతని సినిమాలకి స్పూర్తి ఇచ్చిందట. నవ్వించిన పాత్రల వెనుక విషాదాన్ని చొప్పించి వాటిని ప్రపంచ ప్రఖ్యాతి చేశాడు.

చాలా చార్లీచాప్లిన్ సినిమాలను ఈ లింక్‌లోకి వెళ్ళి చూడవచ్చు

© Dantuluri Kishore Varma 

2 thoughts on “నవ్వుల వెనుక ఎంత విషాదం!

Leave a comment